ఆధార్ ఏ విధంగా వ్యక్తి యొక్క గుర్తింపును సులభతరం చేస్తుందో, భూసేవ అటువంటి ప్రయోజనాలను భూమి యొక్క గుర్తింపు కొరకు అందిస్తోంది.
భూభాగాలను గుర్తించడం, వాటికి భూ అక్ష్యాంశాల(Geo-Coordinates) తో అనుసంధానం చేయడం, ప్రతి భూభాగానికి ప్రత్యేక (unique) గుర్తింపు సంఖ్య కేటాయించడంతో పాటు, డిజిటైజ్ రూపంలో ఆంధ్రప్రదేశ్ యొక్క పూర్తి భౌగోళిక పటాన్ని నెలకొల్పడం ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య లక్ష్యాలు.
అంతేకాక, "భూసేవ" అని పిలువబడే ఏకీకృత వేదిక ద్వారా భూమికి సంబంధించి ప్రభుత్వ విభాగాలన్నీ సమీకృత సేవలను అందించుటకు వీలు కలుగును. తద్వారా ప్రజలకు అనేక ప్రయోజనాలు అందజేయబడును.