భూధార్ ఒక ప్రత్యేకమైన 11-అంకెల సంఖ్య, ఇది వ్యవసాయ భూమి, వ్యవసాయేతర భూమి మరియు పట్టణ ఆస్తులు (నివాస, వాణిజ్య, పారిశ్రామిక లేదా ఇతర), ప్రతి విభాగానికి కేటాయించబడుతుంది . భూధార్ సంఖ్య ఆంధ్రప్రదేశ్ యొక్క 28 - సెన్సస్ కోడ్ నుండి మొదలవుతుంది.
మీరు మీ భూధార్ కార్డు ను రెండు విధములలో డౌన్లోడ్ చేసుకోగలరు. eభూధార్ కార్డ్ వెబ్సైట్ ద్వారా మరియు mభూధార్ కార్డు ను మొబైల్ అప్లికేషన్ ద్వారా డౌన్లోడ్ చేసుకోగలరు.
mభూధార్ (mBhudaar) మొబైల్ అప్లికేషన్ "గూగుల్ ప్లే స్టోర్" లో అందుబాటులో ఉంది.
మీరు మీ జిల్లా,మండలం, గ్రామము, ఖాతా నంబర్ మరియు మీ ఖాతా సంఖ్యకు అనుసంధానించబడిన మొబైల్ నంబర్ తో శోధించడం ద్వారా మీ భుధార్ కార్డును మీ మొబైల్ ఫోన్ నందు డౌన్లోడ్ చేసుకోగలరు.
గమనిక:
ల్యాండ్ రికార్డులలో( రెవిన్యూ డిపార్ట్మెంట్) మీ మొబైల్ నెంబర్ ను మీ ఖాతా సంఖ్యతో అనుసందించబడనిచో మీ భూధార్ కార్డు ను డౌన్లోడ్ చేసుకొనలేరు.
మీ మొబైల్ లో mభూధార్ కార్డును డౌన్లోడ్ చేసుకొనుట ద్వారా మీ ఆస్తిని ఎక్కడికైనా మరియు ఎప్పుడైనా తీసుకువెళ్లవచును.
క్రింద జత చేసి ఉన్న "యూజర్ మాన్యువల్" అనుసరించడం ద్వారా మీరు mభూధార్ మొబైల్ అప్లికేషన్ను సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చును.