భూధార్ ప్రయోజనాలు
భూమి యొక్క యజమాని తన భూమి యొక్క భూధార్ మరియు దాని సంబంధిత సమాచారాన్ని అంగీకరించినప్పుడే భూధార్ ప్రమాణీకరించబడినట్టు అవుతుంది.
అటువంటి భూధార్ కు అనేక ప్రయోజనాలు ఉన్నాయి:
-
భూమి యొక్క స్థితి నిర్ధారణ
-
సమాచారం ముందుగానే పరిశీలించి ధృవీకరించబడుతున్నది కాబట్టి, భూధార్ ఉన్న భూములకు – అనేక ఆధారములు, ధ్రువ పత్రములు సమర్పించాల్సిన అవసరం లేదు
-
భూసేవ లో దరఖాస్తుల స్థితి ఎప్పుడైనా ట్రాక్ చేసి తెలుసుకోవచ్చు
-
భూసేవ పోర్టల్ నుండి సేవల యొక్క ఫలితాన్ని డౌన్లోడ్ ద్వారా పొందవచ్చును.
-
ల్యాండ్ పార్శిల్స్ సమాచారం గురించి ప్రజలకు తిరుగులేని నిజనిర్ధారణ కలిగిన సమాచారం అందించుట .
-
సేవలకు సంబంధించి ముందస్తు సమాచారం సంబంధిత దరఖాస్తుదారులు అందుకుంటారు
-
సంబంధిత ల్యాండ్ పార్శిల్ యొక్క మునుపటి చరిత్ర సులభంగా తెలుసుకోవచ్చును.